దీపావళికి ముందే షాక్ ఇవ్వనున్న విద్యుత్ సంస్థ
HYDERABAD | రాష్ట్రలో రాష్ట్ర ప్రజలకు దీపావళి పండగ ముందే కరెంట్ షాక్ ఇచ్చే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారం మోపొద్దని ప్రతి పక్ష పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శాసనమండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి డిమాండ్ చేశారు. రూ.1200 కోట్ల కోసం ప్రజల నడ్డి విరవడం అవివేకమని అన్నారు. విద్యుత్తు చార్జీల పెంపు ప్రతిపాదనలను విద్యుత్తు నియంత్రణ మండలి నిర్ద్వందంగా తిరస్కరించాలని కోరారు.
అయితే 2024 -25 నుంచి 2028-29 మధ్య కాలానికి దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) ప్రతిపాదించిన ఏఆర్‌ఆర్, వీలింగ్ చార్జీలు, రిటైల్ సరఫరా ధరలు, క్రాస్ సబ్సిడీ సర్ చార్జీలపై ఈఆర్సీ బుధవారం బహిరంగ విచారణ చేపట్టంది. ఈ విచారణకు బీఆర్‌ఎస్ పార్టీ తరఫున మధుసూదనాచారి, మాజీ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు హాజరయ్యారు. విద్యుత్తు సంస్థలను వ్యాపార, లాభాలు గడించే కంపెనీలుగా చూడరాదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా వ్యవహరించడం అత్యంత దారుణమని మధుసూదనాచారి అన్నారు . ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేవిగా విద్యుత్తు సంస్థలను నడపాలని సూచించారు. ఫిక్స్‌డ్ చార్జీలను రూ.10 నుంచి రూ.50కి పెంచాలనుకోవడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.
డిస్కంలు అదనపు ఆదాయం పెంచుకోవడమంటే, ప్రజలపై ఆదనపు భారం మోపడమేనని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్తు చార్జీలు పెంచితే పారిశ్రామికరంగం కుదేలవుతుందన్నారు. పరిశ్రమలు మూతపడతాయని, ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తాయని హెచ్చరించారు. రూ.1200 కోట్లకుపైగా ఆదాయం కోసం ప్రభుత్వం ఆర్రులుచాస్తుందని, ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడమే అవుతుందని అన్నారు. ఉదారంగా వ్యవహరించి రూ.1200 కోట్లను ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో భరించాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఈఆర్సీ ఈ పిటిషన్‌ను తిరస్కరించాలని కోరారు. కేసీఆర్ దూరదృష్టిలోతో తెలంగాణ విద్యుత్తు రంగంలో స్వర్ణమయం అయ్యిందని, స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 7వేల మెగావాట్ల నుంచి 24 వేల మెగావాట్లకు పెరిగిందని గుర్తుచేశారు. అయనతో పాటు పలువురు విద్యుత్ రంగ నిపుణులు, పారిశ్రామిక వేత్తలు, రైతు సంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
* * *
Leave A Comment